Andhra Pradesh: ఏపీ హోం గార్డ్స్ కు శుభవార్త.. దినసరి వేతనం రెట్టింపు

  • దినసరి వేతనం రూ.300 నుంచి రూ.600కు పెంపు
  • మెటర్నిటి సెలవులను మూడు నెలలకు పెంచుతూ నిర్ణయం
  • హోం గార్డు మృతి చెందితే దహన సంస్కారాలకు పదివేలు ఇస్తాం: సీఎం చంద్రబాబు 

ఏపీ హోం గార్డ్స్ కు శుభవార్త. వారి దినసరి వేతనాన్ని రెట్టింపు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. అమరావతిలోని ప్రజాదర్బార్ హాల్లో చంద్రబాబును  హోం గార్డ్స్ కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. హోం గార్డ్స్ సమస్యలపై సానుకూలంగా స్పందించిన, వారి దినసరి వేతనాన్ని రూ.300 నుంచి రూ.600కు పెంచుతున్నట్టు, ప్రసూతి (మెటర్నిటి) సెలవులను మూడు నెలలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.

హోం గార్డు మృతి చెందితే దహన సంస్కారాల నిమిత్తం రూ.10 వేలు మంజూరు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా, ఎన్టీఆర్ వైద్య సేవలో రెండున్నర లక్షల రూపాయల మేర వైద్య సాయంతో పాటు గృహ నిర్మాణ పథకంలో లబ్ధి చేకూర్చే విషయమై సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయిస్తామని చంద్రబాబు చెప్పారు.

Andhra Pradesh
home guards
  • Loading...

More Telugu News