buggana: బుగ్గన, ఆకుల కలసి ప్రభుత్వ వాహనంలో రాంమాధవ్ ఇంటికి వెళ్లారు: వివరాలను బయటపెట్టిన టీడీపీ ఎంపీలు

  • వీడియో ఫుటేజీ, కారు లాగ్ బుక్ వివరాల విడుదల
  • మరిన్ని వివరాలు కావాలన్నా ఇస్తామన్న టీడీపీ ఎంపీలు
  • వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారంటూ ఎద్దేవా

ఢిల్లీలో వైసీపీ, బీజేపీ నేతల సమావేశం వివరాలను టీడీపీ ఎంపీలు మీడియాకు విడుదల చేశారు. వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలు కలసి ప్రభుత్వ వాహనంలో బీజేపీ నేత రాంమాధవ్ ఇంటికి వెళ్లారని వారు వెల్లడించారు. కారు లాగ్ బుక్ వివరాలు, వీడియో ఫుటేజీని విడుదల చేశారు. మరిన్ని వివరాలు కావాలన్నా ఇచ్చేందుకు తాము సిద్ధమని తెలిపారు.

రాజీనామాల పేరుతో వైసీపీ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని కేశినేని నాని ఆరోపించారు. జరగని ఉప ఎన్నికల కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో విభజన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావిస్తారని చెప్పారు. పార్లమెంటులోపలే కాకుండా బయట కూడా తాము ఉద్యమిస్తామని మరో ఎంపీ కనకమేడల తెలిపారు. 

buggana
akula satyanarayana
ram madhav
bjp
ysrcp
Chandrababu
Telugudesam
mp
  • Loading...

More Telugu News