Telangana: తెలంగాణ అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులకు హైకోర్టు నోటీసులు జారీ

  • కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌ల సస్పెన్షన్‌ కేసు
  • సభ్యత్వాలను పునరుద్ధరించని తెలంగాణ సర్కారు
  • కోర్టు ధిక్కార పిటిషన్‌పై హైకోర్టు విచారణ

శాసనసభలో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌లపై స్పీకర్‌ మధుసూదనాచారి సస్పెన్షన్‌ వేటు వేయగా, సదరు కాంగ్రెస్‌ నేతలకి హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు నుంచి తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ తమను ఎమ్మెల్యేలుగా పరిగణించకుండా కోర్టు తీర్పును ధిక్కరిస్తున్నారని కాంగ్రెస్‌ సభ్యులు పిటిషన్‌ వేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది.

Telangana
TRS
komati reddy
  • Loading...

More Telugu News