KCR: సీనియర్ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు మరణం పట్ల కేసీఆర్ సంతాపం!

  • 1969 తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన ఆదిరాజు వెంకటేశ్వర రావు
  • కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి
  • ఉద్యమంలో ఆయన పాత్రను గుర్తించి విశిష్ట పురస్కారం అందించిన రాష్ట్ర ప్రభుత్వం

తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఎంతో పోరాడారని, పత్రికా, సాహితీ రంగాలకు విశేష సేవలు అందించారని పేర్కొంటూ, ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఖమ్మం జిల్లా పండితాపురానికి చెందిన ఆదిరాజు వెంకటేశ్వర రావు 1969 ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. అనేక పుస్తకాలు రచించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన క్రియాశీల పాత్రను గుర్తించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు గతంలో విశిష్ట పురస్కారం అందించింది.

KCR
Hyderabad
Hyderabad District
Telangana
  • Loading...

More Telugu News