Banaganapalli: ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని... బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి కుమారుడి ఆత్మహత్య!

  • ప్రేమ వివాహానికి అంగీకరించని తల్లిదండ్రులు
  • ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న నాగార్జునరెడ్డి
  • కేసు నమోదు చేశామన్న పోలీసులు

బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి కుమారుడు కాటసాని నాగార్జున రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. తన ఇంట్లోనే ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. నాగార్జునరెడ్డి ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకునేందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఆయన ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని భావిస్తున్నామని అన్నారు.

గత రాత్రి తన తండ్రితో కలసి బెంగళూరు నుంచి బనగానపల్లికి వచ్చిన నాగార్జున రెడ్డి, తండ్రితో తన పెళ్లి విషయమై వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. బనగానపల్లిలో నాగార్జున రెడ్డి ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతుండగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపాయి. నాగార్జునరెడ్డి ఆత్మహత్యపై మరింత సమాచారం తెలియాల్సివుంది. 

Banaganapalli
Ex MLA
Katasani Ramreddy
Katasani Nagarjuna Reddy
Sucide
Love Affair
  • Loading...

More Telugu News