India: 474 పరుగులకు భారత్ ఆలౌట్!

  • రెండో రోజు 71 పరుగులు చేసి ఆకట్టుకున్న పాండ్యా
  • యామిన్ అహ్మజాదీకి 3 వికెట్లు
  • రషీద్ ఖాన్, వఫాదార్ లకు చెరో రెండు వికెట్లు

టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేసిన ఆఫ్గనిస్థాన్ పై భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు ఆటలో 347 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన భారత జట్టు, నేడు స్కోరును 474 పరుగుల వరకూ తీసుకెళ్లగలిగింది. హార్దిక్ పాండ్యా 94 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేయడం రెండో రోజు ఆటలో విశేషం.

మొత్తం మీద భారత జట్టులో మురళీ విజయ్ 105, శిఖర్ ధావన్ 107, కేఎల్ రాహుల్ 54, పుజారా 35, రహానే 10, దినేష్ కార్తీక్ 4, పాండ్యా 71, అశ్విన్ 18, జడేజా 20, ఇషాంత్ శర్మ 8 పరుగులు చేయగా, ఉమేష్ యాదవ్ 26 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆఫ్గన్ బౌలర్లలో యామిన్ అహ్మజాదీకి 3 వికెట్లు లభించగా, వఫాదార్, రషీద్ ఖాన్ లకు చెరో రెండు వికెట్లు లభించాయి. మరికాసేపట్లో ఆఫ్గన్ తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.

India
Cricket
Afghanisthan
Bengalore
  • Loading...

More Telugu News