trump jr: ఫాక్స్ న్యూస్ హోస్ట్ తో ట్రంప్ కుమారుడు డేటింగ్.. నిజమేనన్న మాజీ భార్య

  • ఇప్పటి వరకు టాబ్లాయిడ్ లలో వచ్చిన వార్తలు
  • డేటింగ్ నిజమేనన్న వెనెస్సా ట్రంప్
  • ఒకరి నిర్ణయాలను మరొకరం గౌరవించుకుంటామన్న మాజీ భార్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఫాక్స్ న్యూస్ హోస్ట్ కింబర్లీ గ్యూఫోయల్ తో డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన మాజీ భార్య వెనెస్సా ట్రంప్ వెల్లడించారు. కింబర్లీకి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరు భర్తలకూ ఆమె విడాకులు ఇచ్చారు. ట్రంప్ జూనియర్, కింబర్లీకి సంబంధించిన రిలేషన్ షిప్ గురించి ఇప్పటి వరకు అక్కడి టాబ్లాయిడ్ లలో మాత్రమే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వెనెస్సా ట్విట్టర్ ద్వారా దాన్ని బహిరంగంగా ప్రకటించారు.

అయితే ఈ విషయంలో తన మాజీ భర్తను, కింబర్లీని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు వెనెస్సా. ఒక గొప్ప వ్యక్తితో డేటింగ్ చేస్తున్నందుకే ఈ వ్యవహారంలో కింబర్లీపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పారు. తన భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ, ఒకరి నిర్ణయాలను మరొకరం గౌరవించుకుంటున్నామని తెలిపారు. తమ పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దే విషయంపై ఇద్దరం కేర్ తీసుకుంటున్నామని చెప్పారు. 

trump jr
Kimberly Guilfoyle
fox news
america
dating
venessa trump
  • Loading...

More Telugu News