hardhik patel: గుజరాత్ సీఎంతో రాజీనామా చేయించారు.. నేను కచ్చితంగా చెప్పగలను: హార్దిక్ పటేల్

  • నిన్నటి కేబినెట్ మీటింగ్ లో రాజీనామా కోరారు
  • 10 రోజుల్లో రాజీనామాను ఆమోదిస్తారు
  • పాలనలో విఫలమైనందుకే రాజీనామా కోరారు

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారని పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆనంది బెన్ పటేల్ ను సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరినట్టే, నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో విజయ్ రూపానీని కూడా కోరారని తెలిపారు. దీంతో, ఆయన రాజీనామా చేశారని, ఈ విషయాన్ని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు.

మరో పది రోజుల్లో ఆయన రాజీనామాను ఆమోదిస్తారని చెప్పారు. పటిదార్ లేదా క్షత్రియ వర్గాల నుంచి ఎవరో ఒకరు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వాన్ని నడపడంలో విజయ్ రూపానీ విఫలమైనందుకే ఆయన రాజీనామా కోరారని చెప్పారు. రాజీనామాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా... హార్దిక్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనం రేపుతున్నాయి.

hardhik patel
gujarath
vijay rupani
resign
  • Loading...

More Telugu News