kodela shivaprasad: స్పీకర్ కోడెలకు హైకోర్టులో ఊరట.. కరీంనగర్ కోర్టు ఉత్తర్వులు రద్దు!

  • ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పిన కోడెల
  • కోర్టుకెక్కిన కరీంనగర్ వాసి
  • విచారణకు హాజరు కావాలంటూ ఆదేశం
  • కొట్టేసిన ఉమ్మడి హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఓ కేసులో విచారణకు హాజరుకావాలంటూ కరీంనగర్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు చేసినట్టు కోడెల పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయడం ఎన్నికల నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొంటూ కరీంనగర్‌ వావిలాలపల్లికి చెందిన భాస్కర్‌రెడ్డి గతేడాది కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు విచారణకు హాజరు కావాలంటూ కోడెలకు గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోడెల హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి.. కరీంనగర్‌ కోర్టు జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News