Narendra Modi: నరేంద్ర మోదీ చాలెంజ్ పై స్పందించిన మెదక్ ఎస్పీ చందనా దీప్తి!

  • జిల్లాలోని పోలీసులంతా సామర్థ్యాన్ని నిరూపించుకోండి
  • ప్రతి ఒక్కరూ నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
  • మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి

దేశంలోని ఐపీఎస్ అధికారులకు ప్రధాని మోదీ విసిరిన ఫిట్ నెస్ చాలెంజ్ పై మెదక్ ఎస్పీ చందనా దీప్తి స్పందించారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ఉంచారు. జిల్లాలోని పోలీసులంతా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని కోరారు. "నా జిల్లాలోని పోలీసు అధికారులంతా తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అందుకోసం నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి" అని ఆమె వ్యాఖ్యానించారు.

'లెర్నింగ్ న్యూ స్కిల్స్' హ్యాష్ ట్యాగ్ తో చందనా దీప్తి అందరు పోలీసులకూ ఈ చాలెంజ్ ని ఫార్వార్డ్ చేశారు. మెదక్ పరిధిలో దాదాపు 1000 మంది పోలీసులు ఉండగా, మరింత మెరుగైన పనితీరు, నేరాల విచారణలో పారదర్శకత కోసం కంప్యూటర్, నూతన సాఫ్ట్ వేర్, అందుబాటులోని యాప్స్ పై మరింత అవగాహన కలిగివుండాలని ఆమె అన్నారు.

Narendra Modi
Medak District
SP
Chandana Deepti
  • Loading...

More Telugu News