Nara Lokesh: వైసీపీ ఓ డ్రామా కంపెనీ.. జగన్ కమేడియన్.. వైసీపీ ఎంపీలు నటులు!: మంత్రి నారా లోకేశ్ వ్యంగ్యం

  • వైసీపీ ఓ డ్రామా కంపెనీ
  • ప్రధాని మోదీ డైరెక్షన్..బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్క్రిప్ట్
  • అనంతపురం జిల్లా పర్యటనలో లోకేశ్ సెటైర్లు

వైసీపీపైన, ఆ పార్టీ అధినేతపైన మంత్రి నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనంతపురం జిల్లాలోని గుండుమల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలవారికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీపై సెటైర్లు వేశారు. ‘వైసీపీ ఓ డ్రామా కంపెనీ. ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్..బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్  షా స్క్రిప్ట్ లో కమెడియన్ జగన్, నటులు వైసీపీ ఎంపీలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • Loading...

More Telugu News