: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి
రాష్ట్రంలో ఎండలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా పలు ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం అత్యధికంగా కరీంనగర్ జిల్లా రామగుండంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ లో 44, తిరుపతిలో 43.5, నెల్లూరులో 43, కర్నూలు 42.8, హైదరాబాద్ లో 42, అనంతపురంలో 41.6, విజయవాడలో 41, కాకినాడలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖలో 34.1 డిగ్రీలుగా ఉంది.
విదర్భ, ఛత్తీస్ గఢ్, ఒడిసా, మధ్యప్రదేశ్ మీదుగా వేడిగాలులు వీస్తున్నాయి. అవి వాయువ్యంగా పయనిస్తూ రావడంతో తెలంగాణ, రాయలసీమలో వేడి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.