abu salem: పోర్చుగీసు అధికారులతో బాధలన్నీ చెప్పుకున్న గ్యాంగ్ స్టర్ అబూసలేం

  • నాకు చికెన్ ఇవ్వడం లేదు
  • పూర్తిగా శాకాహారిగా మార్చేశారు
  • అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకోవడం లేదు

ఇండియాలో తనకు ప్రాణహాని ఉందని చెప్పడంతో పరిశీలించడానికి వచ్చిన పోర్చుగీస్ అధికారులకు తన బాధలన్నీ చెప్పుకున్నాడు గ్యాంగ్ స్టర్ అబూసలేం. జైలు అధికారులు తనను పూర్తిగా శాకాహారిగా మార్చేశారని... చికెన్ ఇవ్వడం లేదని చెప్పాడు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదని తెలిపాడు. టాయిలెట్ కూడా సరిగా లేదని, తరచుగా అనారోగ్యానికి గురవుతున్నా తనను ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. 1993 బాంబే వరుస బాంబు పేలుళ్ల కేసు, 1997లో గుల్షన్ కుమార్ హత్య కేసులో దోషిగా తేలిన అబూసలేం తలోజా జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు.

ఈ సమావేశంలో జైళ్ల శాఖ ఐజీ, జైలు ఎస్పీ, ఓ సీబీఐ ఆఫీసర్, డాక్టర్లు, సలేం తరపు లాయర్లు కూడా ఉన్నారు. సలేం మోకాళ్లు, కళ్ల సమస్యలతో బాధ పడుతున్నాడని, ముంబైలోని డాక్టర్లకు చూపించాలని చెప్పినా, ఇంత వరకు చూపించలేదంటూ అతని లాయర్ సబా ఖురేషీ తెలిపారు. ఈ సందర్భంగా జైలు ఎస్పీ మాట్లాడుతూ, సలేంకు చికెన్ ఇవ్వలేమని, గుడ్లు ఇవ్వాలని డాక్టర్ సూచిస్తే ఇస్తామని తెలిపారు. కావాలంటే క్యాంటీన్ లో గుడ్లు కొనుక్కోవచ్చని చెప్పారు. బ్యారక్ లో ఉన్న ఖైదీలెవరూ ఫిర్యాదులు చేయలేదని... సలేం ఒక్కడే ఎప్పుడూ ఆరోగ్యం గురించి ఏదో ఒక ఫిర్యాదు చేస్తుంటాడని అన్నారు.

పోర్చుగల్ లో పట్టుబడ్డ సలేంను ఆ దేశం భారత్ కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో పలు కండిషన్స్ మీద అతన్ని అప్పగించారు. దీని గురించి సబా మాట్లాడుతూ, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని... సలేంకు 25 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష వేయకూడదనే నిబంధన ఉన్నా, జీవిత ఖైదు వేశారని ఆరోపించారు.  

  • Loading...

More Telugu News