Nara Lokesh: మోదీకి కన్నా అందజేసిన లేఖపై నారా లోకేశ్ సెటైర్!

  • 90 శాతం హామీలు నెరవేర్చామంటారు 
  • మరి మోదీకి బీజేపీ ఇచ్చిన ఈ కోరికల లిస్టేమిటి 
  • ప్రత్యేకహోదా గురించి ప్రస్తావించలేదే?

ప్రధాని మోదీతో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయిన విషయం తెలిసిందే. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడం, బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురు దాడి, ఇతర పార్టీల కార్యాచరణ తదితర అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం. మోదీకి ఈ మేరకు ఓ వినతిపత్రం కూడా కన్నా అందజేశారు.

ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ లేఖను లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ బీజేపీ అందజేసిన లేఖ ఇది. ఆశ్చర్యమేస్తోంది... ఏపీకి 90 శాతం హామీలు నెరవేర్చామని బీజేపీ చెప్పుకోవడం నిజమే అయితే కనుక, మరిప్పుడు కుతుబ్ మినార్ అంత పొడవుగా ఉన్న ఈ కోరికల లిస్టేమిటి? ఈ జాబితాలో ప్రత్యేకహోదా గురించి ఎందుకు ప్రస్తావించలేదు? అసత్య ప్రచారాలను ఆపి, ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను  నెరవేర్చాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News