imran khan: 'ఇమ్రాన్ ఖాన్ ఓ హోమోసెక్సువల్' అంటూ ఆయన భాగస్వాముల పేర్లు వెల్లడించిన మాజీ భార్య!

  • అలీ అబ్బాసీ, మురాద్ సయీద్ లు ఇమ్రాన్ హోమోసెక్సువల్ భాగస్వాములు
  • రెహమ్ ఖాన్ ఆరోపణలను కొట్టిపారేసిన మురాద్ సయీద్
  • ఇంకా స్పందించని ఇమ్రాన్ ఖాన్

తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత, పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పై అతని రెండో భార్య (మాజీ) రెహమ్ ఖాన్ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో విమర్శలు చేసిన ఆమె, తాజాగా ఆయనొక హోమోసెక్సువల్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. సినీ నటుడు హమ్జా అలీ అబ్బాసీ, పీటీఐ సభ్యుడు మురాద్ సయీద్ లు ఇమ్రాన్ ఖాన్ స్వలింగ సంపర్క భాగస్వాములని తెలిపారు

. ఈ విషయాలన్నీ త్వరలో విడుదల కానున్న రెహమ్ ఖాన్ ఆటోబయోగ్రఫీలో ఉన్నట్టు పాక్ మీడియా పేర్కొంది. ఈ ఆరోపణలను మురాద్ సయీద్ కొట్టిపారేశారు. నీచమైన మనుషులు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఆరోపణలపై ఇంతవరకు ఇమ్రాన్, అలీ అబ్బాసీలు ఇంత వరకు స్పందించలేదు.

imran khan
reham khan
murad sayeed
pakistan
  • Loading...

More Telugu News