kalyan dev: ఆకట్టుకుంటోన్న 'విజేత' ఫస్టు టీజర్

  • కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత'
  • కథానాయికగా మాళవిక నాయర్ 
  • వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు

రాకేశ్ శశి దర్శకత్వంలో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా 'విజేత' సినిమా రూపొందింది. మాళవిక నాయర్ కథానాయికగా నటించిన ఈ సినిమా, వచ్చేనెలలో భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ను చూస్తుంటే ఇది తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథగా కనిపిస్తోంది.

కల్యాణ్ దేవ్ తండ్రి పాత్రలో మురళీశర్మ కనిపించారు. దాదాపు ఈ ఇద్దరికి సంబంధించిన సన్నివేశాలపైనే టీజర్ ను కట్ చేశారు. అందుకే ఎమోషన్ పాళ్లు ఎక్కువగా వుంది.  "లైఫ్ లో కొంచెం కాంప్రమైజై బతకాలి .. తప్పదు. అయినా నువ్ అలా అవ్వకూడదనే నీకు నచ్చిన రూట్ సెలెక్ట్ చేసుకుని నువ్ హ్యాపీగా వుండాలని చిన్నప్పటి నుంచి నీకు ఏది ఇష్టమో అదే ఇస్తూ వచ్చాను .. నా వల్ల అయినంత. ఇంటర్వ్యూస్ కి వెళుతున్నావ్ .. వస్తున్నావ్ .. ఎన్ని రోజులురా ఇలా?" అంటూ కొడుకు పట్ల తండ్రి కాస్త అసహనాన్ని ప్రదర్శించడం ఎంతో సహజంగా అనిపిస్తోంది.

ఇక అందుకు భిన్నంగా ఆ కొడుకు ప్రవర్తన ఉండటంతో ఆ తండ్రి గుండె బరువెక్కడం కూడా మనసుకు హత్తుకునేలా వుంది. కల్యాణ్ దేవ్ లవ్ ట్రాక్ ను కూడా ఈ టీజర్ లో కొంచెం టచ్ చేశారు. నటన పరంగా కల్యాణ్ దేవ్ ఫరవాలేదనిపించాడు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News