Donald Trump: కిమ్ అంతే... అర్ధరాత్రి వీధుల్లోకి వెళ్లి సెల్ఫీలు!

  • ట్రంప్ తో చర్చలకు ఒకరోజు ముందుగానే సింగపూర్ కు కిమ్
  • అర్థరాత్రి వీధుల్లోకి వచ్చిన ఉత్తర కొరియా అధినేత
  • సింగపూర్ వాసులకు అభివాదం

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్, తానెంత వైవిధ్యుడినన్న విషయాన్ని మరోసారి నిరూపించారు. అమెరికా అధ్యక్షుడితో చర్చల నిమిత్తం సింగపూర్ కు వచ్చిన ఆయన, గత అర్ధరాత్రి సింగపూర్ వాసులకు అనుకోని సర్ ప్రయిజ్ ఇచ్చారు. చర్చలకు ఒకరోజు ముందే తన సోదరి కిమ్ యో జాంగ్, విదేశాంగ మంత్రి రీ యాంగ్ హోలతో కలసి వచ్చిన ఆయన, రాత్రి పూట వీధుల్లోకి వచ్చారు.

తీరంలో కాసేపు నడిచారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తో కలసి సెల్ఫీలు దిగారు. 'కిమ్ కిమ్' అంటూ తన పేరును గట్టిగా ఉచ్చరిస్తున్న సింగపూర్ వాసులవైపు చూసి నవ్వుతో అభివాదం చేశారు. కిమ్ అర్ధరాత్రి పర్యటనను సుమారు 100 మంది అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు కవర్ చేశారని తెలుస్తోంది. ఒక దశలో వారు కూడా కిమ్ చిత్రాలను తీయడం కోసం 'కిమ్ కిమ్' అంటూ కేకలు పెట్టారు.

Donald Trump
Kim Jong Un
Syngapore
  • Loading...

More Telugu News