AIIMS: వాజ్ పేయికి తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో బీజేపీ శ్రేణులు!

  • నిన్న ఎయిమ్స్ లో చేరిన వాజ్ పేయి
  • ఊపిరితిత్తుల్లో ఒకటి సరిగ్గా పనిచేయడం లేదు
  • బీజేపీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన

గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, నిన్న తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చిన సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి కొంత విషమంగానే ఉందని ఆసుపత్రి వర్గాల సమాచారం.

ఎంతో కాలంగా ఆయన శ్వాసకోశ సంబంధ వ్యాధితో పాటు, మూత్ర పిండాల సమస్యలతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల్లో ఒకటి సరిగ్గా పనిచేయడం లేదని తెలుస్తోంది. సాధారణంగా జరిపే వైద్య పరీక్షల నిమిత్తమే ఆయన్ను ఆసుపత్రికి తీసుకు వచ్చినట్టు ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నప్పటికీ, ఆయన ఆరోగ్య స్థితిపై బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రాహుల్ గాంధీ, అమిత్ షా, అద్వానీ, జేపీ నడ్డా, సుష్మా స్వరాజ్ వంటి దిగ్గజ రాజకీయ నేతలు ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించి రావడం వాజ్ పేయి అభిమానుల్లో ఆందోళనను పెంచుతోంది. కాగా, దీర్ఘకాలంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, ప్రస్తుతం తనను పరామర్శించేందుకు వచ్చిన వారిని గుర్తించే పరిస్థితిగానీ, వారితో మాట్లాడే పరిస్థితిలోగానీ లేరు.

  • Loading...

More Telugu News