Posani Krishna Murali: పోసానిని హైదరాబాదులో తిరగనివ్వం: గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడి వార్నింగ్

  • చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన పోసాని
  • మెంటల్ కృష్ణగా అభివర్ణించిన శ్రీనివాస్
  • బీజేపీ, వైసీపీ ఏజెంట్ లా మాట్లాడారంటూ ఆగ్రహం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ, మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నారంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ మండిపడ్డారు. పోసానిని హైదరాబాదులో తిరగనివ్వబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ, వైసీపీ ఏజెంట్ లా ఆయన మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రెస్ మీట్ ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రెస్ క్లబ్ కు హుటాహుటిన వచ్చారు. అయితే, ఈలోగానే ప్రెస్ మీట్ ను ముగించుకుని పోసాని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Posani Krishna Murali
tTelugudesam
mn srinivas
Chandrababu
  • Loading...

More Telugu News