Jagan: అతిరాస కులస్తులతో జగన్ ఆత్మీయ సమ్మేళనం

  • 186వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర
  • అతిరాస కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న జగన్
  • చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని కులాలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తాం

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 186వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నందమూరులో ఈరోజు ఆయన అతిరాస కులస్తులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దివంగత రాజశేఖరరెడ్డే తమను బీసీల్లోకి చేర్చారని ఈ సందర్భంగా అతిరాస కులస్తులు చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తమ కష్టాలు తొలగిపోతాయని అన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వస్తే అతిరాస కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని కులాలను గుర్తించి, వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని చెప్పారు. జగన్ పాదయాత్ర రేపు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. 

  • Loading...

More Telugu News