janhvi kapoor: టీనేజ్ లవ్ స్టోరీకి అద్దం పడుతోన్న 'ధడక్' .. ట్రైలర్ రిలీజ్

  • ప్రేమకథా చిత్రంగా రూపొందిన 'ధడక్'
  • ఆకట్టుకుంటోన్న జాన్వీ నటన 
  • వచ్చేనెల 20వ తేదీన విడుదల 

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ .. ఇషాన్ జంటగా 'ధడక్' చిత్రం రూపొందింది. ధర్మ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించాడు. టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్ల ప్రేమకి సంబంధించిన సన్నివేశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ట్రైలర్ ఫస్టాఫ్ లో అందంగా సాగిపోయిన వాళ్ల ప్రేమకథ .. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనేది చూపించారు. సరదాగా సాగిపోయే సందడికి సంబంధించిన సన్నివేశాలపై .. సున్నితమైన భావోద్వేగాలపై ట్రైలర్ కట్ చేశారు. మొత్తం మీద యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా, వాళ్లకి బాగా కనెక్ట్ అయ్యేలా వుంది. జాన్వీ కపూర్ ప్రతి ఫ్రేమ్ లోను చాలా అందంగా కనిపిస్తోంది. మొదటి సినిమానే అయినా నటనలో ఎక్కడా తడబాటు కనిపించకపోవడం విశేషం. వచ్చేనెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News