Tamilnadu: తమిళనాడులో కొత్త పార్టీని స్థాపించిన శశికళ సోదరుడు దివాకరన్

  • కొత్త పార్టీ పేరు ‘అమ్మ అని’ .. ‘అమ్మ జట్టు’ అని దీని అర్థం
  • దివాకరన్ స్వస్థలం తంజావూరులో పార్టీ కార్యాలయం  
  • తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో పార్టీ జెండా

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత దినకరన్, కమలహాసన్ ల నేతృత్వంలో రెండు కొత్త రాజకీయ పార్టీలు వెలిసిన విషయం తెలిసిందే. తాజాగా, మరో కొత్త రాజకీయ పార్టీ వెలిసింది. శశికళ సోదరుడు దివాకరన్ ‘అమ్మ అని’ పార్టీని స్థాపించారు. ‘అమ్మ జట్టు’ అని దీని అర్థం. తెలుపు, నలుపు, ఎరుపు, మధ్యలో ఆకుపచ్చ రంగులతో ఉన్న పార్టీ జెండాను ఈరోజు ఆవిష్కరించారు. దివాకరన్ స్వస్థలమైన తంజావూరులో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఏఐఏడీఎంకే పార్టీ అసలు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పార్టీని తాను స్థాపించినట్టు ఆయన చెప్పారు.

కాగా, గతంలో అన్నాడీఎంకే వర్గం నుంచి బయటకొచ్చిన శశికళ వర్గం నాయకుడు దినకరన్ అమ్మ మక్కల్ మున్నెట్రా కజగం. ఈ పార్టీ నుంచి విభేదించి బయటకొచ్చిన దివాకరన్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.  

  • Loading...

More Telugu News