rai laxmi: బిగ్‌బాస్‌లో తాను ఉన్నట్లు ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాయ్‌ లక్ష్మి

  • ఈనెల 17 నుంచి తమిళంలో బిగ్‌బాస్‌ ప్రసారాలు ప్రారంభం 
  • హోస్ట్‌గా కమలహాసన్‌
  • కొందరు సిల్లీ వ్యక్తులు తన పేరు వాడుతున్నారన్న రాయ్‌ లక్ష్మి
  • అమాయకులను ఫూల్స్‌ చేస్తున్నారని మండిపాటు

తెలుగులో నేటి నుంచి బిగ్‌బాస్‌-2 ప్రారంభం అవుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు ఈనెల 17 నుంచి తమిళంలోనూ ఈ షో ప్రసారాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో నటించేవారి గురించి స్పష్టమైన ప్రకటన రాకపోయినప్పటికీ ప్రముఖ హీరోయిన్లు ఉంటారని ఎన్నో పుకార్లు వస్తున్నాయి. బిగ్‌బాస్‌ తెలుగులో నాని హోస్ట్‌గా కనపడనుండగా, తమిళంలో కమలహాసన్‌ వ్యాఖ్యాతగా అలరించనున్నారు.

కాగా, తమిళ షోలో తాను పాల్గొంటున్నట్లు వస్తోన్న వార్తలను ప్రముఖ నటి రాయ్‌ లక్ష్మి ఖండించింది. బిగ్‌బాస్‌లో తాను ఉన్నట్లు తన గురించి కొందరు పదే పదే వీడియోలు సృష్టిస్తుండంతో సోషల్‌ మీడియాలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం గురించి పదే పదే వివరణ ఇవ్వాల్సి వస్తున్నందుకు విసుగొస్తోందని పేర్కొంది. తాను తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొనడం లేదని, అయినా కూడా ఛానెల్‌కు చెందిన కొందరు సిల్లీ వ్యక్తులు తన పేరు వాడి అమాయకులను ఫూల్స్‌ చేస్తున్నారని ఆమె పేర్కొంది.

 కాగా, ఈరోజు రాత్రి 9 గంటలకు తెలుగు బిగ్‌బాస్‌ షో ప్రారంభం కానుంది 

rai laxmi
big boss
Nani
Kamal Haasan
  • Error fetching data: Network response was not ok

More Telugu News