Nara Lokesh: ‘నటసింహం’ బాల మామయ్యకు బర్త్ డే శుభాకాంక్షలు: నారా లోకేశ్

  • మామయ్యకు ట్వీట్ చేసిన లోకేశ్
  • లెజెండ్ ‘యన్.టి.ఆర్’ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్నా
  • ఎన్టీఆర్ పాత్రలో మిమ్మల్ని చూడాలని ఆత్రుతగా ఉంది

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ, మంత్రి నారా లోకేశ్ ఓ ట్వీట్ చేశారు. ‘‘నటసింహం’ బాల మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. లెజెండ్ ‘యన్.టి.ఆర్’పై నిర్మిస్తున్న బయోపిక్ లో మిమ్మల్ని ఎన్టీఆర్ పాత్రలో ఈ ఏడాదిలో చూసేందుకు ఎదురుచూస్తున్నా’ అని లోకేశ్ అన్నారు.

కాగా, బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సీనియర్ నటుడు నరేష్, నందమూరి కల్యాణరామ్ తదితరులు తమ విషెస్ తెలిపారు. ఈ ఏడాది బాలయ్య బాబు జరుపుకుంటున్న బర్త్ డే ఎంతో ప్రత్యేకమైందని, ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ‘యన్.టి.ఆర్’ బయోపిక్ చూడాలని ఆత్రుతగా ఉందని నరేష్ తన ట్వీట్ లో అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విడుదల చేసిన ‘యన్.టి.ఆర్’ ఫస్ట్ లుక్ ను ఆయన జతపరిచారు.

  • Loading...

More Telugu News