devisri prasad: మల్టీ స్టారర్ ను దేవిశ్రీ చేతుల్లో పెట్టేసిన అనిల్ రావిపూడి!

  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2'
  • హీరోలుగా వెంకటేశ్ .. వరుణ్ తేజ్ 
  • నాయికలుగా తమన్నా .. మెహ్రీన్    

యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే కథలను తయారు చేసుకోవడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. గతంలో ఆయన తెరకెక్కించిన పటాస్ .. సుప్రీమ్ .. రాజా ది గ్రేట్ సినిమాలే అందుకు నిదర్శనం. దిల్ రాజు నిర్మాణంలో తాజాగా ఆయన ఒక మల్టీ స్టారర్ మూవీని ప్లాన్ చేశాడు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.

వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించనున్న ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఆయన దేవిశ్రీ ప్రసాద్ ను ఎంచుకున్నాడు. దేవిశ్రీ తో మ్యూజిక్ సిటింగ్స్ మొదలయ్యాయి కూడా. ఈ సందర్భంలో ఆయనతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ నటించనున్నారు. హ్యాట్రిక్ హిట్ తరువాత అనిల్ రావిపూడి చేస్తోన్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి.           

devisri prasad
anil ravipoodi
  • Loading...

More Telugu News