Telangana: తెలంగాణ ఆర్టీసీ సమ్మె అంశంపై మంత్రుల సమావేశం

  • సమ్మె నివారణ దిశగా మంత్రుల కమిటీ ప్రయత్నాలు
  • ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో సమావేశం 
  • సమ్మెకు దిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా చర్చ

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నివారణ దిశగా చర్చించేందుకు మంత్రుల కమిటీ సమావేశమైంది. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్, ఈటల రాజేందర్, హరీశ్ రావు, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డితో పాటు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సమ్మె నివారణ దిశగా తీసుకోవాల్సిన చర్యలతో పాటు, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా చర్చించారు. కాగా, ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగించే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. కార్మికులు సమ్మెకు దిగితే ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మరింత నష్టాల బారిన పడుతుందని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News