yogi adithyanath: సంజయ్ దత్ తో యోగి ఆదిత్యనాథ్ సమావేశం.. మద్దతు ఇవ్వాలంటూ అభ్యర్థన

  • సంపర్క్ ఫర్ సమర్థన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా సమావేశం
  • మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరణ
  • ఇప్పటికే పలువురు ప్రముఖులను కలిసిన అమిత్ షా

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిశారు. సంపర్క్ ఫర్ సమర్థన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా సంజూతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గత నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలవాలని కోరారు.

2019 ఎన్నికల నేపథ్యంలో, బీజేపీ 'సంపర్క్ ఫర్ సమర్థన్' ప్రచార కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా చేపట్టింది. ఇందులో భాగంగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సహా పార్టీకి చెందిన 4000 మంది నేతలు వివిధ రంగాల్లోని లక్ష మంది ప్రముఖులను వ్యక్తిగతంగా కలుస్తారు. పార్టీ పని తీరును, ఆశయాలను వివరించి... వారి మద్దతును కోరుతారు. మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, గాయని లతా మంగేష్కర్, పారిశ్రామికవేత్త రతన్ టాటా, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే లాంటి ప్రముఖులను అమిత్ షా ఇప్పటికే కలిశారు.  

yogi adithyanath
sanjay dutt
bollywood
sampark for samarthan
  • Loading...

More Telugu News