yogi adityanath: సీఎం యోగి ముఖ్య కార్యదర్శిపై అవినీతి ఆరోపణలు!

  • రోడ్డు వెడల్పు కోసం లంచం అడిగిన గోయల్
  • గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బాధితుడు
  • విషయమేంటో చూడాలంటూ యోగికి లేఖ రాసిన గవర్నర్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య కార్యదర్శి ఎస్పీ గోయల్ పై అవినీతి ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. హర్దోయ్ లో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసే విషయంలో రోడ్డు వెడల్పు కోసం అదనపు స్థలం కోరినందుకు గోయల్ రూ. 25 లక్షల లంచం డిమాండ్ చేశారనేది ఆరోపణ. ఈ అంశంపై బాధితుడు అభిషేక్ గుప్తా రాష్ట్ర గవర్నర్ రాంనాయక్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఏం జరిగిందో చూడాలంటూ యోగి ఆదిత్యనాథ్ కు లేఖ రాశారు. తనకు అందే ఏ ఫిర్యాదునైనా ఎప్పటికప్పుడు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళతానని చెప్పారు. అయితే, తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని గోయల్ అన్నారు. గవర్నర్ నుంచి లేఖ వచ్చిన తర్వాతే సంబంధిత ఫైల్ తన వద్దకు వచ్చిందని చెప్పారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి కూడా చెప్పానని తెలిపారు.

yogi adityanath
goyal
bribe
Uttar Pradesh
  • Loading...

More Telugu News