lakshmi manchu: చెప్పులు లేకుండా నడిచిన రోజులున్నాయి: మోహన్ బాబు

  • తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడ్డాను
  • ఈ రోజున ఈ స్థితిలో వున్నాను  
  • దర్శకుడికి మంచి భవిష్యత్తు వుంది

మంచు లక్ష్మి ప్రధాన పాత్రగా రూపొందిన 'w/o రామ్' సినిమా నుంచి ఈ రోజు ఉదయం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ బాబు మాట్లాడుతూ .. "ఈ సినిమా నిర్మాత అమెరికాలో వుంటారు .. ఆయన లక్ష్మి ప్రసన్నను నమ్మి డబ్బు పెట్టారంటే నాకు చాలా గర్వంగా వుంది. ట్రైలర్ లో కొన్ని ఫ్రేమ్స్ చూశాను .. దర్శకుడు విజయ్ చాలా బాగా తీశాడు.

తొలి ప్రయత్నంలోనే ఆయనకి సక్సెస్ దక్కాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను కూడా కొత్తే .. తొలినాళ్లలో నేను చెప్పులు లేకుండా తిరిగిన రోజులున్నాయి .. ఎన్నో కష్టాలు పడుతూ ప్లాట్ ఫామ్ నుంచి ఈ స్థితికి వచ్చాను. ఏ రోజున ఏం జరగాలో అదే జరుగుతుంది .. అది భగవంతుడి నిర్ణయం. దర్శకుడు విజయ్ కి మంచి భవిష్యత్తు వుంది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది" అంటూ లక్ష్మి ప్రసన్నతో పాటు యూనిట్ సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.            

lakshmi manchu
aadrsh balakrishna
  • Loading...

More Telugu News