Pawan Kalyan: వేసవి విడిది కోసమే ఆయన వచ్చారు!: పవన్ అరకు పర్యటనపై గిడ్డి ఈశ్వరి సెటైర్లు

  • వేసవి విడిది కోసమే అరకు వచ్చారు
  • రాజకీయ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారు
  • రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ ఏజెన్సీలో పర్యటించడంపై పాడేరు టీడీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శలు గుప్పించారు. ఆంధ్ర ఊటీగా పేరున్న అరకుకు పవన్ కేవలం వేసవి విడిది కోసమే వచ్చారని ఎద్దేవా చేశారు. ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబే అని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబుపై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.

పాడేరుకు వచ్చిన సందర్భంలో ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేకుండా పవన్ మాట్లాడారని... ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 2014 తర్వాత రూ. 11 కోట్లతో అరకులో రోడ్లు వేశారని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నా... పవన్ కు కనిపించకపోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

Pawan Kalyan
giddi eswari
paderu
araku
  • Loading...

More Telugu News