Shahrukh Khan: పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న షారుఖ్ కజిన్ నూర్జహాన్!

  • ఖైబర్ ఫక్తూన్ ఖ్వా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ
  • షావాలి ఖతాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న నూర్జహాన్
  • పాక్ లో ఉంటున్న షారుఖ్ తండ్రి తరపు బంధువులు

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ సోదరి (షారుఖ్ కి పెదనాన్న కూతురు) నూర్జహాన్ పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వచ్చే నెల 25న పాకిస్థాన్ లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఖైబర్ ఫక్తూన్ ఖ్వా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేయబోతున్నారు. ఈ వివరాలను అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి.

నూర్జహాన్ తన కుటుంబంతో కలసి షావాలి ఖతాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గతంలో కౌన్సిలర్ గా కూడా సేవలందించారు. షారుఖ్ తండ్రి తరపు బంధువులు పాక్ లోనే ఉంటున్నారు. మరోవైపు, షారుఖ్ తో నూర్జహాన్ సంబంధాలను కొనసాగిస్తున్నారు. గతంలో రెండు సార్లు ఆమె ముంబైకి వచ్చి, షారుఖ్ కుటుంబ సభ్యులతో గడిపి వెళ్లారు.

Shahrukh Khan
sister
noorjahan
Pakistan
elections
contest
  • Loading...

More Telugu News