Korrameenu fish: మృగశిర ఎఫెక్ట్.. అమాంతం పెరిగిన చేపల ధర!

  • రూ.700 పలికిన కిలో కొర్రమీను
  • రవ్వలు, బొచ్చలు కిలో రూ.140
  • అయినా వెనక్కి తగ్గని ప్రజలు

మృగశిర కార్తె ఎఫెక్ట్‌తో చేపల ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. కార్తె ప్రారంభం రోజున చేపలు తింటే రోగాలు నయమవుతాయని ప్రజలు విశ్వసిస్తారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు ఒక్కసారిగా రేట్లను పెంచేశారు. మార్కెట్లో ప్రస్తుతం మాంసానికి మించి చేపల ధరలు ఉన్నాయి. అయినప్పటికీ చేపల కోసం ప్రజలు పోటీ పడుతుండడం విశేషం.

హైదరాబాద్‌లో అతిపెద్దదైన ముషీరాబాద్ బోయబస్తీ చేపల మార్కెట్లో తెల్లవారుజాము నుంచే చేపల విక్రయాలు ఊపందుకున్నాయి. కొర్రమీను చేపలు కిలో రూ.700 నుంచి రూ.800 పలికాయి. కొంచెం చిన్నసైజు ఉన్న వాటిని రూ.600కు విక్రయించారు. రూ.70-రూ.80 మాత్రమే పలికిన రవ్వ, బొచ్చ చేపల ధరలు రెండింతలయ్యాయి. వీటిని ఏకంగా రూ.140కి విక్రయించారు. మృగశిర కార్తె సందర్భంగానే చేపల ధరలు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు.

  • Loading...

More Telugu News