Congress: బలమైన నాయకుడు అంటే లావుగా ఉండడం కాదు!: నాగంపై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు

  • గత ఎన్నికలలో గెలవలేని నాగం బలమైన నాయకుడు ఎలా అవుతారు
  • నాగర్‌కర్నూల్‌లో దామోదర్‌రెడ్డే బలమైన నాయకుడు
  • దామోదర్‌రెడ్డిని సంప్రదించకుండా నాగంని పార్టీలోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదు

నాగం జనార్దన్‌రెడ్డి టీడీపీలో బలమైన నాయకుడు కావొచ్చేమోగానీ, కాంగ్రెస్‌లో మాత్రం కాదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. 'గత ఎన్నికలలో గెలవలేని నాగం బలమైన నాయకుడు ఎలా అవుతారు?.. బలమైన నాయకుడు అంటే లావుగా ఉండడం కాదు. ఒకవేళ బలమైన నాయకుడే అయితే కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చేవారు కాదు.

నాగర్‌కర్నూల్‌లో మొదటినుంచి కాంగ్రెస్‌ కి అండగా ఉన్నది దామోదర్‌రెడ్డే. అలాంటి నాయకుడితో అధిష్ఠానం సంప్రదింపులు జరపకుండా నాగంని పార్టీలోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదు' అన్నారు. మనస్తాపం చెందిన దామోదర్‌రెడ్డి పార్టీ మారుతున్నట్లు తెలియడంతో తన నిర్ణయం మార్చుకోమని చెప్పానని అన్నారు. కాగా రేపు జరగనున్న సీఎల్పీ సమావేశానికి హాజరుకావడం లేదని, రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్నదే తన ఆశ అని ఆమె తెలిపారు.

Congress
Telangana
Telugudesam
Rahul Gandhi
Hyderabad
Hyderabad District
  • Loading...

More Telugu News