imran khan: పార్టీలోని మహిళలకూ లైంగిక వేధింపులు: ఇమ్రాన్ ఖాన్ పై మాజీ భార్య రెహమ్ తీవ్ర వ్యాఖ్యలు

  • సెక్సువల్ ఫేవర్స్ చేసే మహిళలకు పార్టీలో ప్రయోజనాలు 
  • ఇమ్రాన్ గెలిస్తే.. దేశాన్ని తీవ్రవాదులకు అప్పగిస్తాడు
  • ఆయన పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలి

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ పై ఆయన రెండో భార్య (మాజీ భార్య) రెహమ్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను రాసిన ఓ పుస్తకంలో ఇమ్రాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె రాసిన పుస్తకం ఇప్పుడు పాక్ లో రాజకీయ దుమారం రేపుతోంది.

తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ లో మహిళలపై ఇమ్రాన్ లైంగిక వేధింపులు ఉంటాయని పుస్తకంలో పేర్కొన్నారు. సెక్సువల్ ఫేవర్స్ చేసే మహిళలకు పార్టీలో ఉండే ప్రయోజనాలను ఆమె వివరించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ గెలిస్తే, దేశాన్ని తీవ్రవాదులకు అప్పగిస్తాడని తెలిపారు. ఇమ్రాన్ పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఇమ్రాన్ ఖాన్ వల్ల తాను అనుభవించిన ఎన్నో ఘటనలను పుస్తకంలో వివరించారు. జర్నలిస్టు అయిన రెహమ్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ తో కేవలం 10 నెలలు మాత్రమే సంసారం చేశారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు.

imran khan
reham khan
india
terrorists
pakistan
sexual favours
  • Loading...

More Telugu News