suma: ఐస్‌క్రీమ్‌ తింటూ కడుపుబ్బా నవ్విస్తోన్న యాంకర్‌ సుమ.. వీడియో ఇదిగో!

  • ప్రత్యేక ఐస్‌క్రీమ్‌ తిన్న యాంకర్‌
  • నోరు, ముక్కులోంచి పొగలు
  • అలరిస్తోన్న వీడియో

తెలుగు యాంకర్‌ సుమ తన మాటకారితనంతో, తనదైన శైలిలో విసిరే పంచ్‌లతో యాంకరింగ్‌ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలోనూ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా ఆమె ఓ చోట ఐస్‌క్రీమ్‌ తింటూ వీడియో తీసుకుంది. అది మామూలు ఐస్‌క్రీమ్‌ కాదు. ఎంతో చల్లగా ఉండే ఆ ఐస్‌క్రీమ్‌ను తింటే నోట్లోంచి, ముక్కులోంచి పొగలు కక్కాల్సిందే.

దాన్ని సుమ తింటూ తనదైన శైలిలో హావభావాలు ఒలకబోస్తూ, ఐస్‌క్రీమ్‌ రుచిని ఆస్వాదించింది. దాన్ని తింటూ నవ్వుతూ అందరినీ నవ్విస్తోంది. ఓ డ్రాగన్‌ వదిలే శ్వాసలా ఇలా పొగ వచ్చేస్తోందని సుమ పేర్కొంది. ఫేస్‌బుక్‌లో ఆమెకు మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.                                                                          

  • Loading...

More Telugu News