Telugudesam: టీడీపీ వీడే ప్రసక్తే లేదు: గల్లా అరుణ

  • అలాంటి ఆలోచన లేదు
  • వైసీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలు అబద్ధం
  • రాజకీయాలకు దూరం కాను

ఏపీ టీడీపీ సీనియర్ నేత గల్లా అరుణ ఆ పార్టీ వీడుతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గల్లా అరుణ స్పందించారు. టీడీపీని వీడే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. వైసీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని, ఆ వార్తలన్నీ అవాస్తవమేనని అన్నారు.

కాగా, చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం తొండవాడలో టీడీపీ కార్యకర్తలతో ఆమె ఈరోజు సమావేశమయ్యారు. నియోజకవర్గ ఇన్ చార్జిగా ఆమే కొనసాగాలంటూ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ విషయమై స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టుబట్టారు. రాజకీయాలకు తాను దూరం కానని, పార్టీ బలోపేతం నిమిత్తం వేరే వారిని నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించాలని సీఎం చంద్రబాబును కోరినట్టు చెప్పారు. సీఎం చంద్రబాబుతో చర్చించి, ఆయన ఓ నిర్ణయం చెప్పే వరకు ఈ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉంటానని కార్యకర్తలకు ఆమె హామీ ఇవ్వడంతో కార్యకర్తలు శాంతించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News