Jagan: జగన్! నారా & వైఎస్ ఇంటి పేర్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది!: నారా లోకేశ్

  • రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే మార్గాన్ని మేము ఎంచుకున్నాం
  • మీరు అవినీతి మార్గాన్ని ఎంచుకున్నారు
  • మా కుటుంబం ఇరవై ఐదేళ్లు పడ్డ శ్రమ ఫలితం ‘హెరిటేజ్’

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపైన, హెరిటేజ్ సంస్థపైన ఆరోపణలు గుప్పించిన వైసీపీ అధినేత జగన్ కు ఏపీ మంత్రి నారా లోకేశ్ దీటుగా సమాధానమిచ్చారు. ‘డియర్ ప్రతిపక్ష నేత.. నారా & వైఎస్ ఇంటి పేర్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే మార్గాన్ని మేము ఎంచుకున్నాం. మీరు అవినీతి మార్గాన్ని ఎంచుకున్నారు. ఆస్తులను ప్రకటించిన ఏకైక రాజకీయ కుటుంబం మాది అనే విషయాన్ని గుర్తుంచుకోండి.

ఈ విషయంలో మమ్మల్ని అనుసరించే దమ్మూధైర్యం మీకుందా? మా కుటుంబం ఇరవై ఐదేళ్లు పడ్డ శ్రమ ఫలితం హెరిటేజ్ సంస్థ. దీని కోసం మా అమ్మ, బ్రాహ్మణి చెమటోడ్చి కష్టపడ్డారు. మాపై మీ నాన్న ఇరవైకి పైగా కేసులు బనాయించారు. ఏ ఒక్క కేసును నిరూపించలేకపోయారు. ఎందుకంటే, నీతి, నిజాయతీ, నైతిక విలువలతో మేము వ్యాపారం నిర్వహిస్తాం కనుక. దీని నుంచి ఈ విషయం మీరెందుకు నేర్చుకోకూడదు?’ అని లోకేష్ హితవు పలికారు.

  • Loading...

More Telugu News