cuddapah: కడపకు స్టీల్ ప్లాంట్ రాకుండా అడ్డుపడుతున్నారు: సీఎం చంద్రబాబు

  • విభజన చట్టంలో ఉన్న స్టీల్ ప్లాంట్ రాకుండా అడ్డుపడుతున్నారు
  • వైసీపీ రాజీనామాల డ్రామాలాడుతోంది
  • లాలూచీ రాజకీయాలకు పాల్పడే వారిని చిత్తుగా ఓడించాలి

కడపకు స్టీల్ ప్లాంట్ రాకుండా అడ్డుకుంటున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కడపలో నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, విభజన చట్టంలో ఉన్న స్టీల్ ప్లాంట్ మనకు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా వైసీపీపై మండిపడ్డారు.

ప్రధాని మోదీ వద్ద విశ్వాసం ప్రకటిస్తారని, బయటకు వచ్చి అవిశ్వాసం అంటారని వైసీపీ నాయకులను దుయ్యబట్టారు. తమపై ఉన్న అవినీతి కేసులు, రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టడం సరికాదని హితవు పలికారు. వైసీపీ రాజీనామాల డ్రామా ఆడుతోందని, ఇప్పుడు రాజీనామాలు చేయడం వల్ల ఉపయోగం లేదని, ఉపఎన్నికలు రావని అన్నారు. లాలూచీ రాజకీయాలకు పాల్పడే వారిని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నిప్పులా బతికానని, హక్కుల సాధన కోసమే ధర్మపోరాట దీక్ష చేస్తున్నానని చెప్పారు.

cuddapah
steel plant
Chandrababu
  • Loading...

More Telugu News