kaala movie: కాలా చిత్రం విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్... నిలిపివేతకు నో

  • సినిమా విడుదల కోసం ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు
  • విడుదల విషయంలో మేం జోక్యం చేసుకోం
  • సుప్రీంకోర్టు స్పష్టీకరణ... రేపు సినిమా విడుదల

రజనీకాంత్ నటించిన కాలా సినిమా విడుదల నిలిపివేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం రేపు విడుదల కానుంది. ‘‘ప్రతి ఒక్కరు ఉత్కంఠతో సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నారు. విడుదల విషయంలో మేం జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదు’’ అంటూ సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు సైతం సినిమా ప్రశాంతంగా విడుదల అయ్యేందుకు అవసరమైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆదేశించింది.

కావేరీ నదీ జలాలపై రజనీకాంత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయన సినిమాను అడ్డుకుంటామని కన్నడ అనుకూల సంఘాలు ప్రకటించిన విషయం విదితమే. కర్ణాటకలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం కావేరీ నదీ జలాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని రజనీ లోగడ డిమాండ్ చేశారు. కాగా, సినిమా విడుదల వాయిదా పడితేనే బాగుంటుందని వ్యక్తిగతంగా తాను భావిస్తున్నట్టు సీఎం కుమారస్వామి ప్రకటించగా, కర్ణాటక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వాటిని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

kaala movie
rajnikanth
Supreme Court
  • Loading...

More Telugu News