sajid khan: ఐపీఎల్ బెట్టింగ్ లో మరో బాలీవుడ్ ప్రముఖుడు

  • ఏడేళ్లుగా బెట్టింగ్ కు పాల్పడుతున్న దర్శకుడు సాజిద్ ఖాన్
  • పోలీసు విచారణలో వెల్లడించిన సోనూ జలన్
  • ఇప్పటికే నేరం ఒప్పుకున్న అర్భాజ్ ఖాన్

ఐపీఎల్ బెట్టింగ్ బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ఈ వివాదంలో చిక్కుకున్నాడు. బెట్టింగ్ లో తాను రూ. 2 కోట్ల మేర నష్టపోయానని పోలీసుల ఎదుట వెల్లడించాడు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ లో ప్రధాన నిందితుడు సోనూ జలన్ మరో బాంబు పేల్చాడు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ కూడా బెట్టింగ్ లో ఉన్నాడని పోలీసుల విచారణలో తెలిపాడు. సాజిద్ గత ఏడేళ్లుగా బెట్టింగ్ లకు పాల్పడుతున్నాడని చెప్పాడు.

అయితే ఇంతవరకు సాజిద్ కు పోలీసులు సమన్లు జారీ చేయలేదు. సోనూను అరెస్ట్ చేసిన తర్వాత అతని వద్ద నుంచి పోలీసులు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలో 100కు పైగా బుకీల పేర్లు ఉన్నాయి. అర్భాజ్ తో పాటు ఎంతో మంది బిల్డర్లు, కాంట్రాక్టర్ల వివరాలు ఉన్నాయి. పోలీసుల విచారణలో పలువురు పెద్ద మనుషుల పేర్లను సోనూ బయటపెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. సాజిద్ ఖాన్ బాలీవుడ్ దర్శకురాలు ఫర్హాఖాన్ కు సోదరుడు.

sajid khan
arbaaz khan
Bollywood
ipl
betting
sonu jalan
farah khan
  • Loading...

More Telugu News