Virat Kohli: ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకునే ఆటగాళ్ల జాబితాలో కోహ్లీకి చోటు!

  • ఫోర్బ్స్ 2018 అత్యధిక ఆర్జన ఆటగాళ్లలో ఒకడిగా చోటు
  • టాప్ 100 జాబితాలో 83వ ర్యాంకు
  • అమెరికా బాక్సింగ్ ఛాంపియన్ మేవెదర్ కు మొదటి స్థానం

ఈ ప్రపంచంలో అత్యధికంగా పారితోషికం అందుకునే ఆటగాళ్లలో కోహ్లీ కూడా చేరిపోయాడు. ఈ మేరకు ఫోర్బ్స్ పత్రిక ఓ జాబితాను రూపొందించింది. ఇందులో అమెరికాకు చెందిన బాక్సింగ్ ఛాంపియన్ ప్లైడ్ మేవెదర్ మొదటి స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 83వ ర్యాంకులో ఉన్నాడు. ఇతడి పారితోషికం 2.4 కోట్ల డాలర్లు (సుమారు రూ.158 కోట్లు).

ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన ‘వరల్డ్స్ హయ్యస్ట్ పెయిడ్ అథ్లెట్స్ 2018’ జాబితాలో ఒక్క మహిళా అథ్లెట్ లేకపోవడం విశేషం. భారత్ లోనే కాకుండా కోహ్లీ ప్రపంచవ్యాప్తంగానూ ప్రాచుర్యం పొందిన ఆటగాడిగా ఫోర్బ్స్ పేర్కొంది. ట్విట్టర్లో 2.5 కోట్ల మంది ఇతడ్ని ఫాలో అవుతున్నట్టు వివరించింది.

ఇక ప్రపంచ నంబర్ 1గా ఈ జాబితాలో నిలిచిన మేవెదర్ పారితోషికం 28.5 కోట్ల డాలర్లు (రూ.1,881 కోట్లు). అర్జెంటీనా ఫుట్ బాలర్ లియోనెల్ మెస్సి రెండో స్థానంలో, సాకర్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మూడో స్థానంలో ఉన్నారు. టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ 7వ స్థానం, టైగర్ వూడ్స్ 16వ స్థానంలో నిలిచారు. టాప్ 100 ఆటగాళ్ల ఉమ్మడి ఆర్జన 3.8 బిలియన్ డాలర్లు. రూపాయిల్లో 2,580 కోట్లు. గతేడాదితో పోలిస్తే 23 శాతం ఎక్కువ. పుమా, పెప్సీ, ఆడి, ఓక్లే తదితర పాప్యులర్ బ్రాండ్లకు కోహ్లీ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగా ఆర్జిస్తున్నాడు.

  • Loading...

More Telugu News