vistara airlines: విస్తారా విమాన ప్రయాణం భలే చౌక... రూ.1,299కే

  • ఈ ఒక్క రోజే అవకాశం
  • 75 శాతం వరకు తగ్గింపు ధరలు
  • ఎయిర్ ఏషియా టికెట్ రూ.1,399 నుంచి ప్రారంభం

విస్తారా ఎయిర్ లైన్స్ ప్రయాణ చార్జీలపై 75 శాతం వరకు తగ్గింపు ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఒక్క రోజు మాత్రమే తగ్గింపు ధరలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు ప్రయాణించాలనుకునే వారికి ఈ అవకాశం. సాధారణ చార్జీలపై మార్గాన్ని బట్టి 75 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. రూ.1,299 నుంచి చార్జీలు ప్రారంభమవుతాయి. హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో అయితే టికెట్ ధర రూ.2,199. టికెట్ చార్జీకి అదనంగా ఇంధన సర్ చార్జీ, పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. వర్షాకాలం కావడంతో ఆఫ్ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని సాధారణంగా విమానయాన సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లను తెస్తుంటాయి. ఎయిర్ ఏషియా అయితే, రూ.1,399 నుంచి టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 10 వరకు బుకింగ్ కు అవకాశం ఉంది.

vistara airlines
discount sale
  • Loading...

More Telugu News