: వచ్చే ఎన్నికలు తెలంగాణపైనే: కిషన్ రెడ్డి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే వచ్చే ఎన్నికలలో తెలంగాణ అంశంతో ప్రజల ముందుకు వెళతామని చెప్పారు.
2014 ఎన్నికలు తెలంగాణ అంశంపైనే ఉంటాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన మరోసారి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని శాసనసభ, లోక్ సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని చెప్పారు.