Pawan Kalyan: పవన్ కల్యాణ్ సీఎం అవుతుంటే.. ఆయనతో కలిసి సినిమాల్లో ఎలా నటిస్తా?: షకలక శంకర్

  • పవన్ కల్యాణ్ మెడలో ధరించేది కేవలం రెడ్ టవలే కాదు
  • విప్లవ సంకేతం.. అదే సగం బలం
  • ఆ టవల్ ఉంటే విజయం ఖాయం

పవన్ కల్యాణ్ తో కలిసి సినిమాల్లో నటించేందుకు సిద్ధమేనా? అంటూ అడిగిన ప్రశ్నకు ‘జబర్దస్త్’ నటుడు షకలక శంకర్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'పవన్..సీఎం అవుతుంటే, ఆయనతో కలిసి ఇంకా సినిమాల్లో ఎలా నటిస్తానని అన్నాడు.

పవన్ కల్యాణ్ సీఎం అవుతారని, ఆ తర్వాత పీఎం కూడా అవుతారని పవర్ స్టార్ కు వీరాభిమాని అయిన షకలక శంకర్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రజల్లోకి పవన్ కల్యాణ్ వెళ్లినప్పుడు ఆయన మెడలో ధరించే చిన్నపాటి రెడ్ టవల్ గురించి ప్రస్తావించగా.. అది రెడ్ టవల్ కాదని, విప్లవ సంకేతం అని చెప్పుకొచ్చాడు. ఆ టవల్ ఉంటే విజయం ఖాయమని, అదే సగం బలమని చెప్పిన షకలక శంకర్, అలాంటి టవల్ ను తాను కూడా వాడుతుంటానని అన్నాడు. 

Pawan Kalyan
shakalaka shankar
  • Loading...

More Telugu News