Deblina Benerjee: అవకాశాల పేరిట మోసం చేసిన 'అమ్మాయిలు - అబ్బాయిలు' హీరోయిన్... కేసు నమోదు!

  • హిందీ సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని మోసం
  • రూ. 11 లక్షలు నొక్కేసిందంటున్న బాధితుడు
  • డెబ్లినా బెనర్జీపై కేసు వేసిన వ్యక్తి
  • బాధితుడిపై మరో కేసు వేసిన డెబ్లినా  

దాదాపు ఆరేళ్ల క్రితం తెలుగులో వచ్చిన 'అమ్మాయిలు - అబ్బాయిలు' చిత్రంలో నటించిన డెబ్లీనా బెనర్జీ గుర్తుందా? సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెబుతూ ఆమె తన భర్త గుర్మీత్ చౌదరితో కలసి మోసాలు చేస్తోందన్న ఆరోపణలపై ఇప్పుడు కేసు నమోదైంది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, హిందీ సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని చెప్పి డెబ్లీనా తనను మోసం చేసిందని ఓ వ్యక్తి రాజస్థాన్ లోని నొఖా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు డెబ్లీనా, గుర్మీత్ జంటకు నోటీసులు పంపించారు. వారిద్దరూ తన నుంచి రూ. 11 లక్షలు తీసుకున్నారని, ఆపై స్పందించలేదని బాధితుడు ఆరోపించాడు.

ఇక తనపై కేసు నమోదైన విషయాన్ని తెలుసుకున్న గుర్మీత్, సదరు బాధితుడికి వ్యతిరేకంగా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. తన పేరును తప్పుగా వాడుకుంటున్నాడని, సదరు వ్యక్తి ఎవరో తనకు తెలియదని, అతనికి, తనకూ మధ్య లావాదేవీలు జరగలేదని చెబుతోందీ భామ. పోలీసులు మాత్రం రెండు కేసులూ నమోదు చేసుకుని విచారణలో నిజాలు తేలుస్తామని అంటున్నారు.

Deblina Benerjee
Tollywood
Bollywood
Fraud
Police
  • Loading...

More Telugu News