Tollywood: రాజమౌళి, సుకుమార్ నుంచి... నాగ్ అశ్విన్ వరకూ... టాలీవుడ్ అగ్ర దర్శకులంతా ఒకే ఫ్రేమ్ లో!

  • దర్శకులకు విందు ఇచ్చిన వంశీ పైడిపల్లి
  • హాజరైన టాలీవుడ్ అగ్ర దర్శకులు
  • ఫొటో షేర్ చేసుకున్న వంశీ

టాలీవుడ్ అగ్ర దర్శకులంతా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే... కనులకు విందే. గత రాత్రి అదే జరిగింది. వంశీ పైడిపల్లి తన ఇంట్లో సోమవారం రాత్రి ఓ పార్టీని నిర్వహించగా, ప్రముఖ దర్శకులంతా హాజరయ్యారు. వీరంతా కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్న వంశీ పైడిపల్లి, "అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను" అని క్యాప్షన్ పెట్టాడు.

ఈ చిత్రంలో రాజమౌళి, సుకుమార్‌, క్రిష్‌, కొరటాల శివ, హరీశ్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, నాగ్‌ అశ్విన్‌, సందీప్‌ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి ఉన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి తన ఇంటికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలని వంశీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వీరంతా తమతమ చిత్రాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి షేర్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.

Tollywood
Directors
Rajamouli
Vamsi Paidipally
Sukumar
Nag Ashwin
  • Error fetching data: Network response was not ok

More Telugu News