Rain: తెలంగాణకు గుడ్ న్యూస్.. మరో 24 గంటల్లో తొలకరి పులకరింత!

  • ఒక రోజు ఆలస్యంగా రుతుపవనాలు
  • నేడు రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు
  • వాతావరణ శాఖ ప్రకటన 

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాలకు ఇప్పటికే వ్యాపించిన రుతుపవనాలు రేపు (బుధవారం) తెలంగాణలో అడుగుపెట్టనున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. నేటి నుంచే రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

కేరళలో ముందే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి మాత్రం ఒక రోజు ఆలస్యంగా వస్తున్నాయి. కాగా, రెండు రోజులుగా చల్లబడిన వాతావరణంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.

Rain
Telangana
IMD
Hyderabad
  • Loading...

More Telugu News