vadapalli: గోదావరిలో మళ్లీ కదిలిన టూరిస్టు బోట్ లు!

  • గత నెలలో వాడపల్లి వద్ద ప్రమాదం
  • అప్పటి నుంచి ఆగిన టూరిస్టు బోట్ లు
  • బోట్ లను తనిఖీలు చేసిన అధికారులు
  • 17 బోట్లకు అనుమతి

గోదావరి నదిలో టూరిస్టు బోట్ లు తిరగడం మళ్లీ ప్రారంభం అయింది. గత నెలలో వాడపల్లి వద్ద జరిగిన వరుస ప్రమాదాల తరువాత, టూరిస్టు బోటులను నిలిపివేసిన అధికారులు, అన్ని తనిఖీలూ పూర్తి చేసి 17 టూరిస్టు బోట్ లకు అనుమతులు ఇచ్చారు. ఈ ఉదయం పర్యాటకులను తీసుకుని కొన్ని బోట్లు పాపికొండలు, కిన్నెరసాని అందాలను చూపించేందుకు బయలుదేరాయి.

 మరపురాని అనుభూతులను మిగిల్చే పాపికొండలు పర్యటనకు అనుమతి ఇవ్వాలని పలు వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, టూరిజం శాఖ నుంచి క్షుణ్ణంగా బోట్లను తనిఖీలు చేసి, ఆ తరువాతనే అనుమతులు ఇవ్వాలన్న ఆదేశాలు వెళ్లాయి. ఆపై కదిలిన అధికారులు, టూరిస్టు బోట్లలోని రక్షణ పరికరాలను పరిశీలించారు. బోటులో ఎంతమంది ఉంటే అంతమందికీ సరిపడా లైఫ్ జాకెట్లు, మంటలు చెలరేగితే ఆర్పేందుకు అవసరమైన పరికరాలు, బోటు సామర్థ్యం, అందులో కల్పించే సౌకర్యాలను పరిశీలించి 17 బోట్లకు అనుమతులు ఇచ్చారు.

  • Loading...

More Telugu News