Pawan Kalyan: అరకులో రిసార్టును దాటి బయటకు రాని పవన్ కల్యాణ్!

  • శనివారం రాత్రి నుంచి అరకులోనే పవన్ కల్యాణ్
  • ఓ ప్రైవేటు రిసార్ట్ లో బస చేసిన జనసేనాని
  • ఎవరినీ కలవని పవన్ కల్యాణ్

తన బస్సు యాత్రలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లా పర్యటనలను ముగించుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, శనివారం రాత్రి నుంచి అరకులోని ఓ రిసార్టుకే పూర్తిగా పరిమితమయ్యారు. శనివారం సాయంత్రం పద్మాపురం గార్డెన్స్‌ దగ్గరున్న ఒక ప్రైవేటు రిసార్ట్ లో బసచేసిన ఆయన, ఆదివారమంతా అక్కడే గడిపారు. కాసేపు రిసార్ట్ ఆవరణలోనే వాకింగ్ చేశారు. ఆపై తన గదిలోకి వెళ్లిపోయిన ఆయన ఇక బయటకు రాలేదని సమాచారం.

పవన్‌ ను కలవడానికి పాడేరు ప్రాంతానికి చెందిన జనసేన కార్యకర్తలు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యతో పాటు పలువురు ప్రయత్నించినప్పటికీ, పవన్ అందుబాటులోకి రాలేదు. నేడు సీఎం చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా ఎస్‌ కోటలో పర్యటించనున్నందున, పవన్‌ కల్యాణ్ తన టూర్‌ షెడ్యూల్‌ ను కాస్తంత మార్చుకున్నారని సమాచారం.

Pawan Kalyan
Jana Sena
Vijayanagaram District
Araku
Resort
  • Loading...

More Telugu News