airport: నడిరోడ్డుపైకి ఒక్కసారిగా... విమానం వచ్చి ల్యాండ్‌ అయిన వైనం!

  • కాలిఫోర్నియాలో ఘటన
  • విమాన ఇంజిన్‌లో సాంకేతిక సమస్య
  • తప్పిన ప్రమాదం

వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డుపైకి ఒక్కసారిగా విమానం వచ్చి ల్యాండ్‌ అయిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతోనే ఈ ఘటన జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆ విమానం హంటింగ్టన్ బీచ్‌ ఎయిర్‌పోర్టు నుంచి శాంటానాకు బయలుదేరిందని అన్నారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే మహిళా పైలట్‌ అత్యవసరంగా ఇలా రోడ్డుపై ల్యాండ్‌ చేయాల్సి వచ్చిందని చెప్పారు. రోడ్డుపై విమానం దిగడంతో వాహనదారులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, పైలట్ చాకచక్యంతో వ్యవహరించారని తెలిపారు.                                            

airport
airplane
america
  • Loading...

More Telugu News